Jul 27,2023 21:59

కరపత్రాన్ని అందజేస్తున్న పరిటాల శ్రీరామ్‌

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : పార్టీలకు అతీతంగా సంక్షేమపథకాలు అందిస్తున్నామని ఒక పక్క గొప్పలు చెప్పుకుంటూ మరో పక్క పథకాలకు పార్టీల రంగులు పూస్తున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు. పట్టణంలోని 17వ వార్డులో గురువారం టీడీపీ నాయకులతోకలిసి పరిటాల శ్రీరామ్‌ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి మ్యానిపేస్టో పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్‌, కాచర్లకంచన్న, రాంపురం శీన, లక్ష్మీనారాయణ, అంబటిసనత్‌, రాళ్లపల్లి షరీప్‌, అస్లాంబాషా తదితరులు పాల్గొన్నారు.