ప్రజాశక్తి - ఆదోని
సంక్షేమంతోనే పేదరికం దూరమవుతుందని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రతి గడపకూ వెళ్లి వార్డుల సమస్యలు మురుగు కాలువలు, తాగునీటి వసతి, వీధిదీపాలు, కల్వర్టులను పరిశీలించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు అందాయని తెలుసుకుంటూ ముందుకు సాగారు. మున్సిపల్ ఛైర్మన్ శాంత, వైసిపి పట్టణ అధ్యక్షులు దేవా, సీనియర్ నాయకులు చంద్ర కాంత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, స్టేట్ డైరెక్టర్ రేణుక, వైస్ ఛైర్మన్ గౌస్, వార్డు ఇన్‌ఛార్జీ బిటి.లక్ష్మణ్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజినీర్ కృపాకర్, రాజశేఖర్ రెడ్డి, నాయకులు సింహం నాగేంద్ర, డీలర్ నాగరాజ్, వికె.వెంకటేష్, జయపాల్, తాయన్న, తిమ్మప్ప, బాలు, శంకర్, కిశోర్, రామలింగేశ్వర యాదవ్, ముని, లక్ష్మన్న మమ్ముత్ స్వామి, చిన్న ఈరన్న, సంజీవ్, లక్ష్మీనారాయణ, రాము, ఆనంద్, రంగ, చిన్న వీరప్ప, హరి, భవాని, మల్లి పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి










