Oct 30,2023 20:43

లబ్ధిదారులతో మాట్లాడుతున్న ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - గోనెగండ్ల
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైసిపి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని వైసిపి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం గోనెగండ్లలోని సచివాలయం-2 పరిధిలో 'గడపగడపకు మన ప్రభుత్వం' ప్రారంభించారు. ఉదయం 7 గంటలకు మొట్టి వీధిలో ప్రారంభమైన కార్యక్రమం ఒంటయ్య దర్గా, దొడ్డిచేను వీధుల్లో సాగింది. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు, వాటి ద్వారా వారు పొందిన లబ్ధిని వివరించారు. ఆయా వీధుల్లో స్థానిక సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పే వినతులను గ్రీవెన్స్‌లో పొందుపరచాలని సంబంధిత సచివాల సిబ్బందికి సూచించారు. తమ వీధిలో తాగునీరు నాలుగు రోజులకోసారి వస్తోందని పేట మాబు సాహెబ్‌ తెలిపారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు జల జీవన్‌ యోజన పథకం కింద ఇంటింటికీ ఉచిత కుళాయిల ద్వారా నీరు ఇచ్చేందుకు రూ.2 కోట్లు కేటాయించామని, అందులో భాగంగా ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణం పనులు కూడా ప్రారంభమయ్యాయని, త్వరలోనే గ్రామంలో తాగునీటి సమస్య పూర్తిగా తీరుతుందని నాయకులు తెలిపారు. ఎంపిడిఒ ప్రవీణ్‌ కుమార్‌, ఇఒఆర్‌డి నగేష్‌, టి.బందే నవాజ్‌, మన్సూర్‌, భాస్కర్‌ రెడ్డి, దొరబాబు నాయుడు, కనికె పద్మనాభం, బగిలి రఫీ, చికెన్‌ రాజా, పూజారి కౌలుట్లయ్య, అచ్చుగట్ల బాబు, గృహ సారథులు బగిలి ఉస్మాన్‌, చాకలి శివ పాల్గొన్నారు.