ప్రజాశక్తి-కొనకనమిట్ల: రాష్ట్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పేదల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని గొట్లగట్టు సచివాలయ పరిధిలోని నాయుడుపేటలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడం వలన పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలుపరుస్తున్న జగనన్నను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. పార్టీలకతీతంగా కుల, మత తేడా లేకుండా అర్హులందరికీ అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. అర్హత కలిగి ఇంకా ఎవరైనా రానివారు ఉంటే అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తొలుత గ్రామస్తులు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డికి, కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డిలకు శాలువా కప్పి పూలమాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మోరబోయిన మురళీకృష్ణ, జడ్‌పిటిసి అక్కిదాసరి ఏడుకొండలు, వైసిపి మండల కన్వీనర్ మోరా శంకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఉడుముల రామనారాయణరెడ్డి, చిన్నారికట్ల సొసైటీ అధ్యక్షులు కాశిరెడ్డి, ఉపసర్పంచ్ గాడి కోనేటిరెడ్డి, మాజీ ఎంపిటిసిలు గోనుగుంట్ల శ్రీనివాసులు, ఉప్పుటూరి వెంకటయ్య, మండల స్థాయి అధికారులు, సచివాలయ కన్వీనర్ నాగం వెంకటేశ్వర్లు, నాయకులు పోసాని నారాయణరెడ్డి, డేవిడ్, చలమారెడ్డి, కల్లం దిబ్బారెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










