Jun 27,2023 22:16

వృద్ధురాలితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకరనారాయణ

గోరంట్ల రూరల్‌: సంక్షేమ పథకాలతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే మాలగుంట్ల శంకరనారాయణ పేర్కొన్నారు. మంగళవారం గోరంట్ల మండలంలోని కమ్మవారి పల్లి గ్రామంలో నిర్వహించి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుమునుపు ఎమ్మెల్యేకు గ్రామంలో సర్పంచి మణిశివ శంకరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వీరనారాయణరెడ్డి, నారాయణరెడ్డి, వెంకటరంగారెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు నాయకుల దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, సెంట్రల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ పాతూరి శంకరరెడ్డి, సర్పంచి నాగేనాయక్‌తో పాటు పలువురు నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
తనకల్లు : ప్రజాసమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పివి. సిద్ధారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గోవిందవారి పల్లి, సి బి కాలనీ, కొక్కంటి క్రాస్‌లో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ మధుసూదన్‌ రెడ్డి, నాయకులు వైవి శ్రీనివాస్‌ నాయుడు, అరుణమ్మ, బిఎస్‌ నిజాం, పొలం సిద్ధారెడ్డి, కొండా మల్లికార్జున, హిమదర్‌ రెడ్డి, అశోక్‌ రెడ్డి, సర్పంచులు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అమరాపురం : ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు. మండల పరిధిలోని లో పెలుబండలో సర్పంచి చిత్తన్న యాదవ్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న, వైస్‌ ఎంపీపీలు లలితమ్మ, కృష్ణమూర్తి, జెడ్పీటీసీ సారక్క నరసింహమూర్తి, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ నళిని రంగేగౌడ్‌, డైరెక్టర్‌ వీరక్యాతప్ప తదితర నాయకులతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
బత్తలపల్లి : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని డి చెర్లోపల్లి గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం రూ 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, రూ.17.50 లక్షలతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, రూ.21.90 లక్షలతో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రం, రూ. 17.67 లక్షలతో నిర్మించిన జగనన్న పాలవెల్లువ మహిళా డైరీ సహకార సంఘం నూతన భవనాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎపి కురుబ కార్పోరేషన్‌ చైర్మన్‌ కోటి సూర్యప్రకాష్‌ బాబు, ఎంపిపి త్రివేణి , తాడిమర్రి ఎంపిపి భువనేశ్వర్‌ రెడ్డి, అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్‌ రెడ్డి, సర్పంచి గుజ్జల రమాదేవితో పాటు పలువురు నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
హిందూపురం : ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, వైస్‌ చైర్మేన్‌ జబివుల్లా, కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌తో కలిసి పట్టణంలోని 18వ వార్డు పరిధిలో బోయపేట ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ప్రజాసమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్‌చార్జ్‌ కవిత, కౌన్సిలర్లు అయూబ్‌, ముస్తక్‌, పరుశురాం, నాయకులు లతీఫ్‌ సేట్‌, శివన్న, లక్ష్మి నారాయణ, ఇలియాజ్‌, ఇలియాజ్‌ పాల్గొన్నారు.