Sep 19,2023 21:35

మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి

          ప్రజాశక్తి-అనంతపురం   వైసిపి పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని వైసీపీ అర్బన్‌, నియోజకవర్గ రూరల్‌ కన్వీనర్‌గా నియమితులైన హుస్సేన్‌ మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం జగన్‌ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో అమలు చేసిన హామీలను ప్రజలకు వివరించాలన్నారు. ముఖ్యంగా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకే నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్బన్‌ నియోజకవర్గ పరిధిలో ఐదు క్లస్టర్లను ఏర్పాటు చేసి ఇప్పటికే జెసిఎస్‌ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఆశాబీ, జెసిఎస్‌ కన్వీనర్‌ ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఉమ్మడి మదన్మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ చంద్ర, ఎంపిటిసి సంధ్య, వైసిపి నేతలు మల్లెల వేణుగోపాల్‌, జగన్‌మోహన్‌రెడ్డి, అంజీ, రహీం, దౌలా, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, కార్పొరేటర్‌ సైఫుల్లా బేగ్‌, తదితరులు పాల్గొన్నారు. కాగా వైసిపి రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి నివాసంలో కేస్‌ కోసి సంబరాలు చేసుకున్నారు.