Apr 19,2023 22:42

tahasildar b.rajyalakshmi

సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యేక చర్యలు
పమిడిముక్కల తహశీల్దార్‌ బి.రాజ్యలక్ష్మి
ప్రజాశక్తి-పమిడిముక్కల
రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రణాళిక బద్ధంగా నిర్ణీత లక్ష్యాలను సాధించాలని పమిడిముక్కల తహశీల్దార్‌ బి.రాజ్యలక్ష్మి చెప్పారు. పమిడిముక్కలలోని రెవెన్యూకార్యాలయంలో ఆమె ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు ఆదేశాల మేరకు పమిడిముక్కల మండలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వైఎస్సార్‌ జగనన్న గృహాల నిర్మాణాలు మండలంలో పురోగతి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తక్కువ పురోగతి ఉన్న గ్రామాల్లో సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పర్యటించి అక్కడి స్థితిగతులను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. జగనన్న లేఔట్లలో నీరు, విద్యుత్తు, రహదారులు సిమెంటు, ఇసుక, ఇనుము తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. గృహ లబ్ధిదారులైన మహిళలకు బ్యాంకు రుణాలను సకాలంలో అందజేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. ఇంకా ధాన్యం నిల్వలు ఉన్న రైతులు అధైర్యపడాల్సిన పనిలేదన్నారు. వరి కుప్పలకు జియో ట్యాగింగ్‌ ఇవ్వటం ద్వారా ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. లంకపలి, మంటాడ, తాడంకిలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.