బ్యారేజీని పరిశీలిస్తున్న ఎంఎల్‌ఎ
సంగం బ్యారేజీ పరిశీలన
ప్రజాశక్తి-సంగం:సంగం బ్యారేజీ వద్ద బుచ్చి మంచి నీటి సరఫరాకు ఇంటెక్ వెల్, ఫిల్టరేషన్ ప్లాంట్ నిర్మాణానికి ప్రదేశాన్ని ఎంఎల్‌ఎ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఇంటెల్ వెల్ నిర్మాణం పై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో అమత్ -2 నిధులు రూ.85 కోట్లతో ఎన్ ఎస్ ఆర్ మంచినీటి సరఫరా అభివద్ధి పథకానికి శంకుస్థాపన చేసామని తెలిపారు.10 వేల 650 కుళాయి కనెక్షన్ల తో ప్రతీ ఇంటికి రక్షిత మంచినీటిని సరఫరా చేయబోతున్నామన్నారు.త్వరలోనే బుచ్చిరెడ్డి పాలెం ప్రజల దాహార్తిని తీర్చబోతున్నామని పేర్కొన్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బుచ్చిరెడ్డిపాలెం అభివద్ధికి పూర్తి స్థాయిలో కషి చేస్తున్నామని అన్నారు.కార్యక్రమంలో సోమశిల ఎస్‌ఇ రమణా రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ గోపాల్ రెడ్డి, ఇఇ అనీల్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.










