జనంతో సముద్రం తీరం
ప్రజాశక్తి-సింగరాయకొండ: సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరం మంగళవారం సందడిగా మారింది. దసరా పండుగ కావటంతో సోమ మంగళవారాలు పండగలు చేసుకొని సాయంత్రం సమయంలో పాకల సముద్ర తీరానికి జనం భారీగా తరలివచ్చారు. సాయంత్రం సమయంలో కందుకూరు ప్రాంతం నుంచి దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించుకొని విగ్రహాలతో సముద్రానికి రావటం కనిపించింది. దీంతోపాటు సెలవు కావడంతో బుధవారం నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కావడం వలన ముందుగా సముద్ర తీరానికి చిన్నారులతో తరలివచ్చి సందడి చేశారు.










