ప్రజాశక్తి - మక్కువ : మండలంలోని శంబరలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి గడపకు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందించాలనేఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో గడపగడపకు వైద్య సిబ్బందిని పంపించి వైద్య సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వైసిపి మండల నాయకులు ఎం.రంగునాయుడు, జెడ్పిటిసి సభ్యులు శ్రీనివాసరావు, ఇతర మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
పాలకొండ : పట్టణంలోని 15, 16 వార్డుల్లో వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే విస్వసరాయి కళావతి చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ వెళ్లి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అండగా ఈ ప్రభుత్వం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలన్నారు. ఎంఎల్‌సి పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఈ ప్రభుత్వందే అన్నారు. కార్యక్రమంలో నగరపంచాయితీ వైస్ చైర్మన్ రౌతు హనుమంతు రావు, పల్లా ప్రతాప్, విశ్రాంతి కమిషనర్ లిల్లీ పుష్పనాధం, కౌన్సిలర్స్ వెలమల మన్మధ రావు, దుప్పాడ పాపినాయుడు, గంగు నాయుడు, కడగల రవణ, టి. శంకర్, నీలాపు శ్రీను, కొంచాడ అరుణ తదితరులు ఉన్నారు.










