Aug 03,2023 19:51

డేగులపాడులో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలిస్తున్న ఎంపిడిఒ

ప్రజాశక్తి - చిప్పగిరి
సచివాలయ కార్యాలయంలో విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగీ సమయపాలన పాటించాలని ఎంపిడిఒ సివి.కొండయ్య సూచించారు. గురువారం మండలంలోని డేగులపాడు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలను, చెత్త సంపద కేంద్రాన్ని, సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించారు. సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించి గ్రామంలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. గ్రామంలో సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని తెలిపారు. వర్షాకాలంలో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని చెప్పారు. ఇఒఆర్‌డి సంజన, పంచాయతీ కార్యదర్శులు జై రామ్‌ నాయక్‌, విఆర్‌ఒ చంద్రనాయక్‌ పాల్గొన్నారు.