May 04,2023 22:08

హాజరుపట్టికను పరిశీలిస్తున్న ఛైర్‌పర్సన్‌

కొత్తచెరువు : గ్రంథాలయ శాఖాధికారులు సమయపాలన పాటించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ ఎల్‌ఎం ఉమా మోహన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆమె కొత్త చెరువు శాఖా గ్రంధాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. ఆనంతరం రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించడం ముఖ్యమని గ్రంధాలయ అధికారి జయరాంను ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ నుంచి జూన్‌ 16 వరకు చేపడుతున్న వేసవి విజ్ఞాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రంథాలయంలో సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఇస్తున్న ఈ సుదీర్ఘ వేసవి విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయ చైర్మన్‌ ఎల్‌ఎం. మోహన్‌ రెడ్డి, నరసింహారెడ్డి, పాఠకులు బసవయ్య, రామాచారి, శంకర్‌, సిబ్బంది వెంకటరమణప్ప, మునీర్‌ తదితరులు పాల్గొన్నారు.
క్షతగాత్రుడికి పరామర్శ : వైసీపీ నాయకుడు వాల్మీకి శంకర్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న జిల్లా గ్రంథాలయ ఛైర్‌పర్సన్‌ ఎల్‌ఎం ఉమాదేవి మోహన్‌ రెడ్డి వాల్మీకిశంకర్‌ను గురువారం పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొల్ల సూరి, మన్నేరి ప్రసాదు, ఎస్‌ రామాంజనేయులు, వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్‌ : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ఉమా మోహన్‌ రెడ్డి సత్యసాయి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి గ్రంథాలయ పనితీరును పాఠకులను అడిగి తెలుసుకున్నారు. రీడర్స్‌ ఆన్‌ డిమాండ్‌ రిజిస్టర్‌ ఉంచాలని పాఠకులకు కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కోరారు. గ్రంథాలయ పన్ను వసూలుకు కృషి చేయాలని గ్రంథాలయ అధికారి ఆంజనేయులును ఛైర్‌పర్సన్‌ ఆదేశించారు.