Sep 01,2023 19:51

కిట్లు పంపిణీ చేస్తున్న కౌన్సిలర్‌ పార్వతి

ప్రజాశక్తి - ఆదోని
సమతుల్య ఆహారం తీసుకోవడం వల్లనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని కౌన్సిలర్‌ పార్వతి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని 1వ వార్డులో అంగన్వాడీ కేంద్రంలో 30 మంది గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని గర్భిణులు క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తహీనత ఉండదన్నారు. మహిళలు, కిశోర బాలికల్లో రక్తహీనత సమస్య వెంటాడుతోందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.