Jul 11,2023 21:39

ధనలక్ష్మి రోడ్డు వాసులతో మాట్లాడుతున్న దీపిక

           హిందూపురం : పట్టణంలోని ధనలక్ష్మి రోడ్డులో నెలకున్న సమస్యను త్వరతగితిన పరిష్కరిస్తామని వైసిపి నియోజక వర్గ సమన్వయ కర్త దీపిక వేణురెడ్డి ఆ ప్రాంత వాసులకు హామీ ఇచ్చారు. ధనలక్ష్మి రోడ్డు విస్తరణలో భాగంగా ఆక్రమణలను మున్సిపల్‌ అధికారులు ఇటీవల తొలగించారు. ఇక్కడ నూతన రోడ్డు నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేయడంతో పాటు భూమి పూజా చేసి పనులు ప్రారంభించారు. అయితే పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కాక పోవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న దీపిక వేణురెడ్డి మంగళవారం అక్కడికి వెళ్లి వారి సమస్యను తెలుసుకున్నారు. వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ను అక్కడికి పిలిచించి సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పనులు ప్రారంభించి, పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ నాగేంద్ర బాబు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.