సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న వైస్ ఛైర్మన్
ప్రజాశక్తి-హిందూపురం : సచివాలయాల పరిధిలో ప్రజలు ఫిర్యాదు చేసిన సమస్యలపై సకాలంలో స్పందించి వెంటనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి వైస్ చైర్మన్ బలరామిరెడ్డి ఆదేశించారు. మంగళవారం 14వ వార్డు పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డ్ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించిన అనంతరం ఫిర్యాదుల పుస్తకంలో రిజిస్టర్ అయిన ఫిర్యాదులపై ఆయన సమీక్షించారు. వార్డ్ వాలంటీర్ల ద్వారా సమస్యలను తెలుసుకొన్నారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఋషి చేయాలని సూచించారు. అనంతరం సచివాలయ సిబ్బందితో కలిసి వార్డులో ఉన్న ఉద్యానవనాన్ని పరిశీలించారు. ఉద్యానవనంలో ఉన్న సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.










