Oct 30,2023 21:44

మాట్లాడుతున్న కమిషనర్‌

మాట్లాడుతున్న కమిషనర్‌
సమస్యలకు పరిష్కారం చూపాలి
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:ప్రజల నుంచి వచ్చిన అర్జులను పరిశీలించి సమస్యలు పునరావతం కాకుండా పరిష్కార మార్గం చూపాలని కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ సంబంధిత అధికారులకు ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ సమస్యలపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లో పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలకు అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జిలలో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పారుదల కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి నీటి ప్రవాహానికి అంతరాయం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
మంచినీటి సరఫరా, పార్కుల నిర్వహణ పనులను ప్రణాళిక బద్ధంగా అమలు చేయాలన్నారు. అదేవిధంగా టిడ్కో గృహాలకు సంబంధించి వస్తున్న అభ్యర్థనలను విచారించి అర్హులందరికీ గృహాలు కేటాయిం చాలన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.