Jul 26,2023 22:18

ప్రభుత్వ పథకాల కరపత్రాన్ని అందజేస్తున్న ఎమ్మెల్యే సిద్ధారెడ్డి

ప్రజాశక్తి కదిరి అర్బన్‌ : సమస్యల పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వలిసాబ్‌ రోడ్డు సచివాలయం 26వ వార్డు పరిధిలోని ఇక్బాల్‌ రోడ్డు, పాతకుమ్మర వీధి, ఖిలాడిబాాషా వీధి, త్యాగరాజు వీధి, ఆజాద్‌ వీధి, బందు సాబ్‌ వీధి, ఆలం ఖాన్‌ వలి మసీద్‌ తదితర ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.