హిందూపురం : అర్హులైన వారందరికి వందశాతం సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం సచివాలయాల ఉద్యోగులతో కలిసి 3వ వార్డు ఆర్‌టిసి కాలనీ, 5వ వార్డు ఆబాద్‌పేట తదితర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను కలిసి ఈ నెల 4వ తేదీ నుంచి ఆయా సచివాలయాల పరదిలో జగనన్న సురక్ష పథకం అమలు కోసం ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని, అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గోరంట్ల రూరల్ : జగనన్న సురక్ష సర్వే కార్యక్రమంలో భాగంగా మండలపరిధిలోని కమ్మవారి పల్లి సచివాలయం పరిధిలోని గ్రామాల్లో జగనన్న సురక్ష క్యాలెండర్లు ఆదివారం పంపిణీ చేశారు. సచివాలయ పరిధిలోని ఎర్రయ్యగారి పల్లి, ఎముకలగుట్టపల్లి మరియు కమ్మవారిపల్లి గ్రామాలలో కమ్మవారి పల్లి సర్పంచి చాపట్ల మణి శివశంకర్ రెడ్డి, ఎంపీటీసీ సిరగం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయ కన్వీనర్లు ఎస్ నారాయణ రెడ్డి, నరేష్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి, రంగారెడ్డి, గృహసారథులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు గడపగడపకు వెళ్లి ప్రజలకు అందిస్తున్నటువంటి 11 రకాల ఉచిత సేవలు గురించి వివరించే జగనన్న సురక్ష క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో రఘునాథ గుప్తా, ఇఒఆర్‌డి సుధాకర్, మండల కన్వీనర్ లక్ష్మీనరసప్ప, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, సచివాలయ కన్వీనర్లు పాల్గొన్నారు.










