నిరసన తెలుపుతున్న హమాలీలు
ప్రజాశక్తి-చీమకుర్తి
హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ హమాలీ వర్కర్స్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర కమిటీ పిలుపుమేర స్ధానిక సివిల్ సప్లయి గోడౌన్ ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ హమాలీ వర్కర్స్ అందరికి పిఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, చనిపోయిన కార్మికుల, రిటైర్డు అయిన కార్మికుల పిఎఫ్, పెన్షన్ సమస్యలు పరిష్కారం చేయాలని, బోనస్ రు.7వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు బిందె ఆంజనేయులు, హనుమ, వెంకటేశ్వర్లు, వీరయ్య, సుబ్బయ్య పాల్గొన్నారు.










