ప్రజాశక్తి - ఆదోని
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి సమ్మెకైనా సిద్ధమని యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటమ్మ, సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్.రాధాకృష్ణ తెలిపారు. గురువారం పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కమిటీ సమావేశం రేణుకమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసిఇప అధికారంలోకి వస్తే అంగన్వాడీ ఉద్యోగులను ఆదుకుంటానని ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మరిచారన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఫేస్ యాప్‌లను రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వరలక్ష్మీ, సుహాసిణి, ప్రభావతి, కాంతమ్మ, పద్మ, లూసమ్మ, కృష్ణవేణి, మహేశ్వరి, బాల దర్గమ్మ పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న వెంకటమ్మ










