Oct 17,2023 20:28

బోరు ఏర్పాటు చేయిస్తున్న సర్పంచి ఇస్మాయిల్‌

ప్రజాశక్తి -పెద్దకడబూరు
మండలంలోని కల్లుకుంట గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో మంగళవారం బోరు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచి ఇస్మాయిల్‌ మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడేవారని, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, వైసిపి నేతలు ప్రదీప్‌ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి సహకారంతో బోరు వేయించినట్లు తెలిపారు. 'గడపగడపకు మన ప్రభుత్వం'లో భాగంగా శ్మశాన వాటికలో తాగునీటి సమస్యపై ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పందించి బోరు వేయించారని తెలిపారు. బోయ లక్ష్మణ, వైసిపి నాయకులు షేర్‌ ఖాన్‌, సర్పంచి తనయుడు ఆసిఫ్‌ పాల్గొన్నారు.