ప్రజాశక్తి-సీతానగరం : రానున్న సాధారణ ఎన్నికలలో టిడిపి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేయాలని మాజీ ఎమ్మెల్సీ దారపురెడ్డి జగదీష్ అన్నారు. మండలంలోని రామవరంలో మహిళా శక్తి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలన్నారు. సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. అనంతరం కొత్తగా నియమితులైన పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.విజరు చంద్రను పరిచయం చేశారు. అనంతరం విజరుచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ పార్టీ కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్ష, కార్యదర్శులు కొల్లు తిరుపతిరావు నాయుడు, రౌతు వేణుగోపాలనాయుడు, నాయకులు కె.వెంకట నాయుడు, శ్రీదేవి, రామవరం సర్పంచ్ పెంట సత్యనారాయణ, ఎస్.హరిగోపాలరావు, శ్రీనివాసరావు, కె.రామకృష్ణ, బి.సూర్యనారాయణ, పారినాయుడు పాల్గొన్నారు.
మహాశక్తితో మహిళల అభివృద్ధి
సీతంపేట : టిడిపి ప్రకటించిన మహాశక్తి పథకంతో మహిళలు అభివృద్ధి చెందుతారని టిడిపి నాయకులు పడాల భూదేవి అన్నారు. బుధవారం మండలంలోని పెదరామలో మహాశక్తి కార్యక్రమాన్ని పడాల భూదేవి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలలో మహాశక్తి గూర్చి మహిళలు తెలుసుకోవాలన్నారు. మహిళలకు మరెన్నో ప్రయోజనాలు, రక్షణ వంటివి టిడిపితోనే సాధ్యమన్నారు. మహిళలంతా టిడిపికి అండగా ఉండాలని కోరారు.










