హైదరాబాద్ : డిజిటల్ హెల్త్ స్టార్టప్ ఎంఫైన్.. రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తెలుసుకోవడానికి యాప్‌లో ఎంఫైన్ పల్స్ పేరుతో టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. బ్యాక్ కెమెరా, ఫ్లాష్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ స్మార్ట్ ఫోన్తోనైనా ఉపయోగించవచ్చునని ఎంఫైన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అజిత్ నారాయణ్ వెల్లడించారు. ముఖ్యంగా ఈ ఆక్సీమీటర్‌ను శ్వాస సంబంధిత సమస్యలు లేదా తీవ్రమైన గుండెజబ్బులున్నవారు.. భారీ గురకతో బాధపడేవారికి ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్సీమీటర్ అరచేతిలో ఇమిడిపోయి.. వారికి సులువుగా ఉంటుంది. అలాగే నవజాత శిశువుల్లో ఆక్సిజన్ సరిగ్గా అందేలా... దాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. అటువంటప్పుడు ఈ ఆధునిక స్మార్ట్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ స్థాయిలను సులభంగా కనుక్కోవచ్చు. అలాగే ప్రస్తుత కరోనా సమయంలో వైరస్ రోగుల్లో కూడా ఆక్సిజన్ స్థాయిలను మానిటరింగ్‌లో ఈ ఆక్సీమీటర్ పాత్ర చాలాకీలకం.
కాగా, ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్ సాంకేతికతతో స్మార్ట్‌ఫోన్ కెమెరా, ఫ్లాష్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఆన్‌డ్రాయిడ్ యూజర్లకు ఇది పరిమితం. త్వరలో ఐఓఎస్ వినియోగదారుల కోసం అందుబాటులోకి రానుంది. ఇంత ఆధునికంగా ఉన్న ఫైన్ పల్స్‌తో స్మార్ట్‌ఫోన్ కాస్తా ఆక్సీమీటర్గా మారిపోతుంది.










