Sep 03,2023 21:31

సన్మానం పొందిన గురువులతో జెడ్పీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, అతిథులు

          ప్రజాశక్తి-అనంతపురం   సమాజాన్ని ప్రభావితం చేసే ఏకైక వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అలాంటి గురువుకు సమాజంలో అత్యున్నత స్థానం ఉందని జెడ్సీ ఛైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అన్నారు. ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వ్యవస్థాపకుల సుంకర రమేష్‌ నేతృత్వంలో జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాల డ్రామా హాలులో ఉత్తమ ఉపాధ్యాయులకు ఆదివారం పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వారు నాలుగేళ్లుగా ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేస్తుండటం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, విశ్రాంత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పతికి రమేష్‌నారాయణ, ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత బిసాటి భరత్‌, పండిట్‌ రియాజుద్దీన్‌, రాష్ట్రపతి అవార్డు గ్రహీత బిసాటి జీవన్‌కుమార్‌, ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షురాలు దివ్యతేజ, ఉపాధ్యక్షుడు దీప్‌కిరణ్‌రెడ్డి, కార్యదర్శి నందిత, స్వప్న, గాయత్రి, జోష్ణ, గణేష్‌, పవన్‌, అలేఖ్య, బాలాజీ, కీర్తి, భూషణ్‌, శివ, తదితరులు పాల్గొన్నారు.