Aug 22,2023 20:02

పండ్లు, బ్రెడ్లు, పాలు అందజేస్తున్న అభిమానులు

ప్రజాశక్తి - కౌతాళం
సమాజ సేవలో మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్స్‌ ఎప్పుడూ ముందుంటారని అఖిల భారత చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షులు రామాంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం చిరంజీవి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాలింతలకు, రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రక్తదానం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి, సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటామన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ శిరీష, మెగా అభిమానులు సంపత్‌, దావుద్‌, మహబూబ్‌, చిన్న, ఆకాష్‌, ప్రకాష్‌ పాల్గొన్నారు.