సమాజ సేవే లక్ష్యంతో పనిచేస్తున్నా : కైలే
ప్రజాశక్తి-మొవ్వ
ఏసుక్రీస్తు చూపిన బాటలో పయనించటం ద్వారా నిరంతరం ప్రజా సేవలో ఉంటూ సేవే లక్ష్యంగా పనిచేస్తున్నానని పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్‌కుమార్ అన్నారు. మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామంలోని సీ.బీ.సీ.ఎన్.సీ చర్చి దైవ సేవకులు రెవ.ఆర్.ఎస్.పౌల్ ఆధ్వర్యంలో జరిగిన మోక్ష మార్గోపదేశ సభలకు ముఖ్య అతిథిగా ఏపీ పాస్టర్స్ ఫెడరేషన్ ప్రధాన సలహాదారులు వైఎస్.థామస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైఎస్.థామస్ రెడ్డి, ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రెవ.పి.జీవన్ కుమార్, ఫెడరేషన్ కష్ణాజిల్లా ఉపాధ్యక్షులు రెవ.ఆర్.ఎస్.పౌల్ లను ఎమ్మెల్యే శాలువా, పూలమాలతో సత్కరించారు. నూతన సేవకులు బందెల.దేవ వరసంపత్ కుమార్, రాయపల్లి.ప్రసన్న శామ్యూల్‌లకు సర్టిఫికెట్లు అందజేశారు. మొవ్వ ఎంపీపీ కొండేటి ఇందిర మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు రెవ.జి.సురేష్ కుమార్, రెవ.జయకర్ రారు, రెవ.కొడాలి ప్రసాదరావు, మీటింగుల కన్వీనర్ బ్రదర్ ఎం.చంద్రరావు, సంఘ సభ్యులు ఆలూరి యోబు, విలియం కేరీ, కొండేటి చందు, గ్రామ విశ్వాసులు పాల్గొన్నారు.










