మాట్లాడుతున్న ప్రిన్సిపల్ సురేష్
ప్రజాశక్తి - ఆదోని
సామాన్యులకు సాధికారత కల్పించేందుకు తీసుకొచ్చిన విప్లవాత్మక చట్టాల్లో సమాచార హక్కు చట్టం-2005 ఒకటని ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు. గురువారం ఆదోని ఆర్ట్స్ కళాశాలలో ఆర్‌టిఐ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ హక్కులను కాపాడుకునేందుకు చాలా మంది అణగారిన వర్గాల ప్రజలు ఈ చట్టాన్ని ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ప్రతి పబ్లిక్ అథారిటీ పనిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడమే ఆర్‌టిఐ లక్ష్యమన్నారు. దేశంలోని అత్యధిక జనాభాలో పేదలు ఉండడం, నిరక్షరాస్యత వల్ల ఈ చట్టంపై అవగాహన లేకపోవడంతో చట్టం ఉద్దేశాలు ఆశించిన స్థాయిలో నెరవేరడం లేదని తెలిపారు. ఈ చట్టంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.










