ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంపికలు స్థానిక బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ప్రారంభమయ్యాయని నియోజకవర్గ క్రీడల సమన్వయకర్త పి.వేణు, మండల సమన్వయకర్త ఎల్.జయరాజులు తెలిపారు. శనివారం ఎంఇఒ బి.రాముడు, శ్రీరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కెవిఎస్ లోవ కుమారిల ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంపికలను ప్రారంభించారు. ఈ సందర్భ పి.వేణు, ఎల్ జయరాజులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాలైన చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, జంగారెడ్డిగూడెం మండలాల నుంచి 200 మంది క్రీడాకారులు, విద్యార్థులు ఈ క్రీడలలో పాల్గొంటారని తెలిపారు. అండర్-14 బాలికలు, అండర్-14 బాలురు, అండర్-17 బాలికలు, అండర్-17 బాలురు పాల్గొనగా, నియోజకవర్గంలోని పాఠశాలల పిడిలు, పిఇటిలు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎ.సాయి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.










