తనిఖీ చేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-నెల్లూరు : నగరంలో పలు ప్రయివేట్ వైద్యశాలల్లోని స్కానింగ్ సెంటర్లలోని విభాగాలను 'డిస్ట్రిక్ట్ లెవల్ మల్టీమెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సభ్యులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ ఎం. హరినారాయణన్ ఆదేశానుసారం శనివారం నగరంలోని సిద్ధార్థ నర్సింగ్ హోం, వేద హాస్పిటల్, పలు స్కానింగ్ సెంటర్లను ఈ కమిటీ సభ్యులు మొదటి అదనపు జిల్లా జడ్జి జి.కబర్థి ఆధ్వర్యంలో డిఎల్‌ఎసి సభ్యులు జిజిహెచ్ గైనకాలజిస్టు , హెచ్‌ఒడి డాక్టరు గీతా లకీë, పిసి అండ్ పిఎన్‌డిటి జిల్లా ప్రోగ్రామ్ అధికారులు బి.శ్రీనివాసరావు, కె.కనకరత్నం తదితరులు సందర్శించారు.










