పార్వతీపురం : గృహనిర్మాణం, ప్రాధాన్యతా భవనాలు సకాలంలో పూర్తిచేసేందుకు నిర్దేశించిన లక్ష్యాలకు చేరుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గృహనిర్మాణం, రీ-సర్వే, జగనన్న పాల వెల్లువ, వికాస్ భారత్ సంకప్లయాత్ర, పంచాయతీ రాజ్ పనులు, తదితర పథకాలపై సమీక్ష నిర్వహిం చారు. వీడియో కాన్ఫెరెన్స్ అనంతరం జాయింటు కలెక్టరు ఆర్.గోవిందరావు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ప్రభుత్వం నిర్దేశిం చిన లక్ష్యాలను సకాలంలో పూర్తిచేసేందుకు నిర్దిష్ట ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని తెలిపారు. గృహనిర్మాణాలు పూర్తిచేసేందుకు కావా ల్సిన మౌలిక వసతులు కల్పించాలని, ప్రాధాన్యత భవనాలు పూర్తిచేసి అప్పగించాలని, ప్రతివారం 25శాతం చొప్పున భవనాలు పూర్తిచేయాలని తెలిపారు. సమావేశంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ.ప్రభాకరరావు, జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్‌పాల్, సిపిఒ పి.వీర్రాజు, సిఎస్‌డిటి జిల్లా మేనేజర్ ఎండి నాయక్, అధికారులు పాల్గొన్నారు.










