ప్రజాశక్తి-నెల్లూరు :జిల్లాలో శిశు మరణాల నివారణకు వైద్య ఆరోగ్య సిబ్బంది సమిష్టి కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టరు ఎం.పెంచలయ్య పిలుపు నిచ్చారు. బుధవారం నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో ఇటీవల సంభవించిన శిశుమరణాలపై సబ్ కమిటీ సమీక్ష నిర్వహించారు. డిఎం అండ్‌హెచ్‌ఓ డాక్టరు ఎం.పెంచలయ్య అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆగస్టు మాసంలో 10, సెప్టెంబరు మాసంలో 8 శిశు మరణాలు సంభవించాయన్నారు. ప్రజలకు వైద్య ఆరోగ్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని, ఈ పథకాలను వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు కలిగే మంచిని వివరించాలన్నారు.కమిటీ సభ్యులు చిన్న పిల్లల వైద్యనిపుణులు డాక్టరు చిరంజీవి, డాక్టరు శ్రావణ్‌కుమార్, డిఐఒ డాక్టరు శెలీనాకుమారి, డిప్యూటి డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టరు బ్రిజిత,డిపిహెచ్‌ఎన్‌ఓ జి.మంజుల, డిమో బి.శ్రీనివాసులు, ఎస్‌ఒ కె.సహన ఉన్నారు.










