ప్రజాశక్తి - ఆదోని
సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గాది లింగప్ప, సీనియర్ నాయకులు పాపయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదోనిలోని విజయభాస్కర్ రెడ్డి సర్కిల్ వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సీనియర్ నాయకులు కృష్ణమూర్తి, సునీల్ రాజ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో పాదయాత్ర సందర్భంగా సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వారంలోపు పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. సిపిఎస్‌ను రద్దు చేసేంత వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు. దీక్షలకు ఎస్‌టియు నాయకులు నాగరాజు, నరసింహులు, సుంకన్న, రవికుమార్, గోపాల్, రమేష్ నాయుడు, సిపిఎం నాయకులు గోపాల్, సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శిబిరం వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు. జిల్లా ఆడిట్ సభ్యులు శ్రీనివాసులు, మల్లికార్జున, ఆదోని నాయకులు రామాంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శి ఓంకార్, ఆలూరు బాధ్యులు బసవరాజ్, మంగయ్య, చంద్రశేఖర్ నాయుడు దీక్షల్లో కూర్చున్నారు.
దీక్షలు చేపడుతున్న నాయకులు










