సిపిఎస్ రద్దు చేయాలి
యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.వెంకట సుబ్బారెడ్డి
ప్రజాశక్తి-డోన్
సిపిఎస్ రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.వెంకట సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం డోన్ పట్టణంలోని పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆడిట్ సభ్యులు ఎం.వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టిఎఫ్‌ఐ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎం.వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ 1997 సంవత్సరంలో మార్చి 15, 16 తేదీలలో చెన్నైలో యుటిఎఫ్ భాగస్వామ్యంతో సిసిఎస్టిఓ ఏర్పడిందని, ఆ తర్వాత మూడు సంవత్సరాలలో పలు రకాల సమస్యలపై ప్రాతినిధ్యం వహించి, వివిధ స్థాయిల్లో ప్రదర్శనలు నిర్వహించి 2000 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ఎస్టిఎఫ్‌ఐగా రూపాంతరం చెందిందన్నారు. ఎస్టిఎఫ్‌ఐలో దేశ నలుమూలల నుండి 19 సంఘాలు అనుబంధంగా ఉన్నాయని మన తెలుగు రాష్ట్రాల నుండి యుటిఎఫ్, కేరళ రాష్ట్రం నుండి కెఎస్టిఎ, తమిళనాడు నుండి టిఎన్పిటిఎఫ్, టిఎన్పిజిటిఎ, టిఎన్‌హెచ్‌హెచ్‌ఎస్‌ఎస్‌జిటిఎ, కర్ణాటక నుండి కెఎస్‌ఎస్ పిఎస్ టిఎ తదితర సభ్య సంఘాలు అనుబంధంగా ఉన్నాయని అన్నారు. ఎస్టిఎఫ్‌ఐ ఏర్పడినప్పటి నుండి వివిధ రాష్ట్రాల్లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. సిపియస్ రద్దు కోరుతూ 2016 జూలై నెలలో కోటి సంతకాల సేకరణ, 2018లో ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఎన్‌పిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఢిల్లీలో ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. 2020లో ఎన్‌ఇపిని తిరస్కరించండి నినాదంతో ఆన్లైన్ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందని,గత సంవత్సరం ఎస్టిఎఫ్‌ఐ మహాసభలు నిర్వహించడానికి విజయవాడ ప్రాంతం వేదికగా సిపిఎస్ రద్దుచేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పూర్వ గౌరవా ధ్యక్షులు నర్సిం హులు, మండల గౌరవాధ్యక్షులు లక్ష్మయ్య, సీనియర్ నాయకులు సుబ్బా రాయుడు, రమేష్, ప్రసాద్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,అల్లిపీరా, రఘునాథ్, చంద్ర మోహన్, రాజకుల్లాయప్ప,రాజన్న, మధు,మాణిక్యంశెట్టి తదితరులు పాల్గొన్నారు.










