Sep 25,2023 22:04

కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న ఫ్యాఫ్టో నాయకులు

        అనంతపురం కలెక్టరేట్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టదాయకంగా ఉన్న సిపిఎస్‌, జిపిఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానం సాధించడమే లక్ష్యంగా పోరాటం సాగిస్తామని ఫ్యాప్టో నేతలు తెలిపారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వీరి ధర్నాకు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ మద్ధతుగా హాజరై మాట్లాడారు పాత పెన్షన్‌ విధానం అమలు చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌ స్పందన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ ఎం.గౌతమిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్‌ ఎస్‌.సిరాజుద్దీన్‌, జనరల్‌ సెక్రటరీ లింగమూర్తి, రాముడు, సిపిఎస్‌ ఉద్యోగుల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్న, ఫ్యాప్టో నాయకులు కరణం హరికష్ణ, నరసింహులు, పురుషోత్తం, గోవింద రాజులు, కోటేశ్వరప్ప, ఎన్‌.రమణా రెడ్డి, శ్రీనివాస రెడ్డి, గోపాల్‌ రెడ్డి లక్షి నారాయణ, వెంకటనారాయణ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, గోపాల్‌ రెడ్డి, సూర్యుడు తదితరులు పాల్గొన్నారు.