Apr 23,2023 22:03

సిపిఎం అభ్యర్థికి తల్లి ద్వారా విరాళం అందజేస్తున్న చిన్నారి

ప్రజాశక్తి - చిలమత్తూరు : ఎక్కడైనా తాము గెలవాలని ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు డబ్బులు పంచడం చూసుంటాం. కాని అభ్యర్థులకే డబ్బులు ఇచ్చి మీరు గెలవాలని కాంక్షించే వారిని ఇప్పుడు చూస్తున్నాం. కర్నాటక ఎన్నికలలో భాగంగా బాగేపల్లి అసెంబ్లీలో సిపిఐ(ఎం) అభ్యర్థిగా డాక్టర్‌ అనీల్‌కుమార్‌ బరిలో ఉన్నారు. ఈ మేరకు ఆయన తన ప్రచారంలో భాగంగా పాతపాళ్యం హౌబ్లీ నారేముద్దేపల్లి గ్రామపంచాయతీ కేంద్రానికి ఆదివారం వెళ్లాడు. అక్కడ చిన్నారి నాజియా తాను రూపాయి రూపాయి కూడబెట్టుకున్న హుండీని అభ్యర్థికి విరాళంగా ఇచ్చింది. ప్రచారానికి ఉపయోగించుకోండి సార్‌ అంటూ ముద్దుముద్దుగా చెప్పింది. చిన్నారి హుందాతనానికి ఫిదా అయిన అభ్యర్థి చిన్నారికి కరచాలనం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి తల్లి సాహీనా భాను కుటుంబం ముందునుండి కమ్యునిస్టు పార్టీ అభిమానులు. ఇలాంటీ అరుదైన గౌరవం కేవలం కమ్యునిస్టు పార్టీ అభ్యర్థులకే దక్కుతుందని పలువురి సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు.