Jun 14,2023 16:10

చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న సిపిఎం నాయకులు

సిపిఎం ఆధ్వర్యంలో చేగువేరా జయంతి
ప్రజాశక్తి-డోన్

       ప్రపంచ విప్లవ వీరుడు కామ్రేడ్ చేగువేరా 95 వ జయంతి వేడుకల కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం  కొండపేటలోని స్థానిక సిపిఎం కార్యాలయంలో చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి నక్క శ్రీకాంత్,సిఐటియు మండల అధ్యక్షులు రామాంజనేయులు,సిఐటియు పట్టణ కార్యదర్శి శివరామ్ ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు షేమిమ్ బేగం,డివైఎఫ్ఐ మండల కార్యదర్శి నక్కిహరి,ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు అశోక్ ,తారకరామ్ నగర్ సిపిఎం శాఖ కార్యదర్శి అక్బర్ బాషా,ఐద్వా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అమృత,మాదేవి లు మాట్లాడుతూ లాటిన్ అమెరికా దేశంలో 1928 జూన్ 14న చేగువేరా పుట్టాడని చిన్న వయసులోనే అస్తమావ్యాధితో బాధపడే వారన్నారు డాక్టర్ చదివే సమయంలో మిత్రులతో కలిసి లాటిన్ అమెరికా అంతా తొమ్మిది నెలల పాటు ప్రయాణం చేసి పేద ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకోవడం జరిగిందని సామ్రాజ్యవాద కార్పొరేట్ వ్యక్తులు పేదలను దోపిడీ చేస్తుందని పేదల జీవితాలలో వెలుగులు నింపేందుకు సామ్రాజవాదులను ఎదుర్కొనేందుకు పోరాటం నిర్వహించాలని నిశ్చయించుకున్నాడు 1953లో డాక్టర్ పట్టా సాధించి సామ్రాజ్యవాదుల దోపిడీ నుంచి పేదలను రక్షించడానికి పోరాడేందుకు తనతో కలిసివచ్చే పోరాటయోధుల కోసం తిరగసాగాడు ఈ సమయంలోనే క్యాట్యాలా దేశంలో పోరాటయోధులతో పరిచయం ఏర్పడింది అక్కడి నుంచి క్యూబా దేశంలో పటిష్ట నియంత పాలనకు వ్యతిరేకంగా క్యాస్ట్రో చేస్తున్న విప్లవం గురించి తెలుసుకొని పరిచయం ఏర్పడింది క్యాస్ట్రోతో కలిసి పెద్ద ఎత్తున దోపిడీదారులకు వ్యతిరేకంగా క్యూబా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించి ప్రతిష్ట అధ్యక్ష పదవి నుంచి దింపేసి క్యూబా అధ్యక్షునిగా క్యాస్ట్రో ఎన్నికయ్యారు క్యాస్ట్రో ప్రభుత్వంలో జాతీయ బ్యాంక్ అధ్యక్షునిగా రక్షణ శాఖ అధిపతిగా పరిశ్రమల శాఖ మంత్రిగా ఎన్నో ఉన్నత పదవులు చేగువేరాకు దక్కాయి క్యూబా లో ఉన్న అమెరికా కంపెనీలను జాతీయం చేసేశారు చేగువేరా పదవుల్లో ఉన్నంతవరకు పేదలకు రైతులకు వారి పిల్లలకు ఎన్నో వైద్యశాలలు బడులు ఏర్పాటు చేయడంతో క్యూబా దేశం అక్షరాస్యతలో 96 శాతం పెరిగిందంటే అది చేగువేరా కృషి అందుకే క్యూబా ప్రజలు క్యాస్ట్రోను ఎంతగా ఆదరిస్తారో చేగువేరాను కూడా అంతగానే అభిమానించే వారని వారు తెలిపారు 1959లో చేగువేరా మనదేశంలో కూడా పర్యటించి ఇండియాకు క్యూబాకు సరి సంబంధాల కోసం కృషి చేశారని వారు అన్నారు చేగువేరా పోరాటయోధుడని శత్రువులకు చేగువేరా అంటే వెన్నులో వణుకు పుట్టేదని చేగువేరాను ఎలాగైనా అట్టు పెట్టాలన్న దృష్టితో అమెరికా ప్రభుత్వం సామ్రాజ్యవాద దేశాలతో చేతులు కలిపి కొడిమియా దేశంతో పోరాడుతున్న చేగువేరాను అంతమొందించాలన్న పన్నాగంతో అమెరికా ప్రభుత్వం కొడిమియా ప్రభుత్వానికి ఆయుధాలను సైన్యాన్ని సమకూర్చి చేగువేరాతో యుద్ధానికి దింపి యుద్ధం జరుగుతున్న సమయంలో చేగువేరాకు 9 బుల్లెట్లు దిగి గాయపడ్డాడు 1967 అక్టోబర్ 8న కొడిమియ్య సైనికులు చేగువేరాను బంధించి ఒక పాడుబడ్డ బడిలో వేసి చిత్రహింసలకు గురి చేశారు ఎలాగైనా చేగువేరాను విడిపించుకోవాలని పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటుకు సిద్ధమవడంతో ఇది గ్రహించిన అమెరికా ప్రభుత్వం కొడిమియా ప్రభుత్వంతో 1967 అక్టోబర్ 9న చేగువేరాను కాల్చి చంపి ఒక గోతిలో చేగువేరా చచ్చిపోయాడని ప్రచారం నిర్వహించిన ప్రజలు దీనిని నమ్మలేదు ఇలా అయితే చేగువేరా ఉన్నాడని ప్రజలు మరింత తిరగబడతారని ఎలాగైనా చేగువేరా చనిపోయాడని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో చేగువేరా రెండు చేతులను నరికి క్యూబా దేశానికి పంపియడంతో అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షలలో నిజంగానే విప్లవ వీరుడు నేలకొరిగాడని అక్కడి ప్రజలు నమ్మారు ఎక్కడ చేగువేరా పార్థికదేహం పూడ్చి పెట్టారు ఒక మాజీ సైనిక అధికారి 28 సంవత్సరాల తర్వాత చెప్పడంతో 1997 అక్టోబర్ 17న చేగువేరా అస్తిపంజరాన్ని తీసుకొచ్చి క్యూబా దేశంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని వారు గుర్తు చేశారు ఇలాంటి విప్లవ వీరుల స్ఫూర్తితో నేటి సమాజంలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా నేటి యువత పోరాడాలని వారు పిలుపునిచ్చారు.