Aug 02,2023 16:40

సీసీ రోడ్డుకు భూమి పూజ నిర్వహిస్తున్న వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషి రెడ్డి

సిమెంట్ రోడ్డుకు భూమి పూజ
ప్రజాశక్తి - బనగానపల్లె

      మండలంలోని పలుకూరు గ్రామంలో  వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషి రెడ్డి భూమి పూజ నిర్వహించారు మంగళవారం పలుకురు గ్రామంలోని ఓసి కాలనీలో మండల పరిషత్ స్కూల్ నుంచి దాసి తిరుపాల్ రెడ్డి ఇంటి వరకు సిమెంట్ రోడ్డుకు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషి రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా  గుండంశేషి రెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు మరల నిలవాలంటే రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళి ముఖ్యమంత్రిగా, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న కాటసాని రామిరెడ్డిని  ఎమ్మెల్యేగా  గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో  వైసిపి సీనియర్ నాయకులు గుండం పక్కిరరెడ్డి, దాసి తిరుపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ శివకృష్ణ, దండగల వెంకటస్వామి, సచివాలయ కన్వీనర్ వెంకటేష్, సురేష్, చాకలి తిమ్మయ్య, చాకలి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.