ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమలో చారిత్రాత్మకమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బద్వేలు నియోజకవర్గం పరిధిలో నుంచి రాయలసీమ పాదయాత్ర ముగించుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా పల్లెతోపాటు టిడిపి సత్యసాయి జిల్లా అధ్యక్షులు బికె పార్థసారథి, పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు తదితరులు లోకేష్ కు ఘనంగా వీడ్కోలు పలికినట్లు పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో 124 రోజులు పాటు, 124 రోజులు పాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాలు 108 మండలాలు 943 గ్రామాల మీదుగా 1587 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన లోకేష్ సీమప్రజల కష్టాలు గమనించి మిషన్ రాయలసీమను ప్రకటించారని పల్లె గుర్తు చేశారు. మిగతా ప్రాంతాల్లో కూడా పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.










