ప్రజాశక్తి-గుంతకల్లు పట్టణంలోని పాత గుత్తిరోడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్టు స్థానంలో ప్రజల సౌకర్యార్థం మెరుగైన వసతులతో నూతనంగా నిర్మించనున్న మార్కెట్‌కు చెందిన టెండర్ల షీల్డ్‌కవర్లను మున్సిపల్ కమిషనర్ వి.మల్లికార్జున, మున్సిపల్ ఇంజనీరు గురప్ప యాదవ్ మంగళవారం గుత్తేదారులు సమక్షంలో తెరిచారు. ఇందులో భాగంగా నూతన కూరగాయల మార్కెట్టు నిర్మాణం కోసం అవసరమైన (డిపిఆర్) డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుకు చెందిన పత్రాలను పరిశీలించారు. ఈ పనులకు తిరుపతికి చెందిన సెవెన్ హిల్స్ ఇంజినీరింగ్ వారు 0.65 శాతానికి టెండర్ కోడ్ చేయగా గుంతకల్లుకు చెందిన సిండికేట్ కన్స్‌స్ట్రక్షన్ వారు 0.98 శాతానికి కోడ్ చేశారు. అయితే ఇద్దరూ జీఎస్టీతోపాటు వారివారి శాతాన్ని కోడ్ చేశారు. ఆయా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసి ఎవరికి పనులను అప్పగించేది తదుపరి తెలియజేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈ1 గుమస్తా భారత్, తదితరులు పాల్గొన్నారు.
టెండర్లను తెరుస్తున్న కమిషనర్ మల్లికార్జున










