Jun 05,2023 23:08

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే

పెనుకొండ : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే శంకర్‌ నారాయణ పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో పలు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన ముగ్గురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.4,75,000 విలువ గల చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.