ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ సిఎం జగన్ రాష్టంలోని మహిళలకు అండగా నిలుస్తున్నారని మేయర్ మహమ్మద్ వసీం తెలిపారు. బుధవారం నగర పాలక సంస్థ కార్యక్రమం వద్ద మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహా క్యాంటిన్‌ను మేయర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు మెప్మా కృషి చేస్తోందన్నారు. దీనికి ప్రభుత్వం సైతం అండగా నిలిచి ఆర్థికసాయం అందిస్తోందన్నారు. ఇప్పటికే విజయవంతమైన జగనన్న మహిళా మార్ట్‌లు, అర్బన్ మార్ట్‌ల తరహాలో మహిళలకు ఆహా క్యాంటిన్‌ల ద్వారా మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అంతే గాకుండా తక్కువ ధరకు రుచి, శుచితో ఆహారం అందుబాటులోకి తీసుకురావడం సంతో షకరమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొగటం విజరుభాస్కర్‌రెడ్డి, కమిషనర్ భాగ్యలక్ష్మి, కార్యదర్శి సంగం శ్రీనివాసులు, మెప్మా పీడీ విజయలక్ష్మి, టిఎంసి శ్రీనివాస్‌రెడ్డి, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు సుగుణ, శిరీషా, పల్లవి, భువన, వేణుగోపాల్, సత్యమూర్తి, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
'ఆహా క్యాంటిన్'ను ప్రారంభించి పరిశీలిస్తున్న మేయర్ వసీం










