సిఎం జగన్‌తో ప్రిన్స్ వహబ్
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
హీరో కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు ప్రిన్స్ వహాబ్ పట్టణంలోని హెలిప్యాడ్ గ్రౌండ్ వద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రితో ప్రిన్స్ వహాబ్ గతంలో హీరో కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ తరఫున తను ప్రచారం చేసిన విషయాలను సిఎంకు వివరించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ... 'నీ పేరు కూడా మహేష్ బాబేనా..' అంటుండగా వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని వహాబ్ అంటూ ముఖ్యమంత్రికి చెప్పారు. వెంటనే జగన్ చిరునవ్వుతో 'ఓకే వహాబ్... వెల్‌డన్' అంటూ భుజం తట్టారు.










