Aug 12,2023 20:21

 'మహిళశక్తి'లో పాల్గొన్న టిడిపి మహిళ నాయకులు

ప్రజాశక్తి - కోసిగి
వైసిపి అధికారంలోకి వస్తే 45 ఏళ్లు నిండిన మహిళలకు పింఛన్లు ఇస్తానని చెప్పి మాటతప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని ఇంటికి పంపుదామని తెలుగు మహిళ జిల్లా కార్యదర్శి నాడిగేని నరసమ్మ, రూతమ్మ, శంకుతలమ్మ, నాడిగేని లక్ష్మి కోరారు. శనివారం టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని నేలకోసిగి గ్రామంలో 'మహిళ శక్తి' నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టిడిపి అధికారంలోకి వస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. పాలకుర్తి తిక్కారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపుదామని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేద్దామని కోరారర. టిడిపి యువజన విభాగం అధ్యక్షులు మహాదేవ పాల్గొన్నారు.