సిఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు
ప్రజాశక్తి-గన్నవరం
ఆసరా పథకం ద్వారా ఉంగుటూరు మండలంలో 1081 డ్వాక్రా గ్రూపులలోని 10827 మంది డ్వాక్రా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో మూడవ విడతగా రూ.10.08 కోట్ల మొత్తాన్ని జమ చేసిన సందర్భంగా శనివారం ఉంగుటూరులో డ్వాక్రా మహిళలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వేడుకలు నిర్వహించారు. ఎంపీడీవో శేషగిరిరావు మాట్లాడారు. ఎ.పి.యం. సాంబశివరావు మాట్లాడారు. గుడివాడ : స్థానిక వైకాపా పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ విభాగం అధ్వర్యంలో అసెంబ్లీలో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బిల్లును స్వాగతిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ సెల్ నాయకులు వెంపటి సైమాన్ మాట్లాడారు. ఏలేటి జోషి, మావెళ్ళ, ఎలిషా, కొంగల దిలీఫ్, పసలాది శేఖర్, తదితరులు పాల్గొన్నారు.










