సిబిఎస్ఇ ఫలితాల్లో విఎస్ సెయింట్ జాన్స్ విజయదుందుబి
ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరంలోని విఎస్ సెయింట్ జాన్స్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ బ్రదర్ సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థిని జి. రెబేక 486/500 మార్కులతో పాఠశాల మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రెండోస్థానంలో ఆముదాల భార్గవ్ 486 మార్కులు సాధించారన్నారు. కె.స్టీఫెన్ పాల్ గణితంలో 100/100 మార్కులు సాధించాడన్నారు. ఫ్లస్ టు విద్యార్థులు 480/500
మార్కులతో ఎన్. హీరారేష్మి మొదటి స్థానం, 470/500 మార్కులతో వి.హృదయాక్షిత రెండోస్థానంలో నిలిచారని చెప్పారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను రెవ.బ్రదర్ జిమ్మీ కురియోకోస్, రెవ.బ్రదర్. బి.జోసఫ్, ఉపాధ్యాయులు అభినందించారు. కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించడం సాధ్యమని తమ విద్యార్థులు రుజువు చేశారని తెలిపారు.










