అగ్ని ప్రమాదంలో దగ్ధమైన సెల్ ఫోన్ దుకాణం
ప్రజాశక్తి - దేవనకొండ
దేవనకొండలోని రాయలసీమ గ్రామీణ బ్యాంకు సమీపంలో ఓ సెల్ ఫోన్ దుకాణం దగ్ధమైంది. సెల్ ఫోన్ దుకాణం ప్రమాదవశాత్తు దగ్ధమైందా..? లేక ఎవరైనా దగ్ధం చేశారా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. సెల్ ఫోన్ దుకాణం తాళాలు పగులగొట్టడంతో ఈ అనుమానాలకు తావిస్తోంది. సెల్ ఫోన్ దుకాణం దగ్ధమైన సమాచారాన్ని పత్తికొండ అగ్నిమాపక కేంద్రానికి తెలపడంతో ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. సుమారు రూ.4 లక్షలు విలువ చేసే సామగ్రి దగ్ధమైనట్లు దుకాణ యజమాని రామచంద్ర సోమవారం తెలిపారు. బాధితుడు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.










