Oct 07,2023 17:56
తహశీల్దార్‌ కార్యాలయంలో సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
వైద్య విభాగంలో ప్రభుత్వ కోటలో 'ఎ' క్యాట్‌లో ఎంబిబిఎస్‌ సీటు సాధించిన షేక్‌ సమ్రీన్‌ను జిల్లా రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌, ఉపాధ్యక్షులు షేక్‌ అహ్మద్‌ అధ్యక్షతన శనివారం తహశీల్దార్‌ కార్యాలయంలో సన్మానించారు. తహశీల్దార్‌ కె.ఆంజనేయులు మాట్లాడుతూ... ప్రజలకు సేవలందించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టమన్నారు. రేషన్‌ డీలర్ల పిల్లలకు పేదలకు సేవలు చేసుకునే భాగ్యం దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. నీట్‌లో ర్యాంకు సాధించి కన్వీనర్‌ కోటాలో తిరుపతిలోని శ్రీబాలాజీ మెడికల్‌ కళాశాలలో ఎంబిబిఎస్‌ సీటు సాధించిన షేక్‌ సమ్రీన్‌ను అభినందించారు. షేక్‌ సమ్రీన్‌కు తహశీల్దార్‌ ఆంజనేయులు శాలువా కప్పి సన్మానించారు. రేషన్‌ దంపతులు తల్లి షహనాజ్‌ బేగం, తండ్రి ఎస్‌.మహబూబ్‌ బాషాలు అధికారులు, డీలర్లు, అభినందించి మిఠాయిలను పంచిపెట్టారు. డిప్యూటీ తహశీల్దార్‌ గురు రాజారావు, సీనియర్‌ అసిస్టెంట్‌ లక్ష్మి, గుడికల్‌ రాముడు, తిమ్మారెడ్డి, రవి, నరసింహులు, రామలింగడు, కౌలుట్ల ఈరన్న పాల్గొన్నారు.