
ప్రజాశక్తి - గోపాలపురం సదరం సర్టిఫికెట్ కోసం గత రెండు రోజులుగా ఒక వృద్ద వికలాంగురాలు స్థానిక పిహెచ్‌సి వద్ద ఎదురుచూపులు చూ స్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం లోని కేసనపల్లి గ్రామానికి చెందిన ఉబ్బాని లక్ష్మి(70) 4 ఏళ్ల క్రితం బస్సు ప్రమా దంలో రెండు కాళ్లు కోల్పోయింది. భర్త మృతి చెంద డంతో కుమార్తె దగ్గర జీవనం సాగిస్తోంది. ప్రస్తుతానికి ఆమెకు వృద్ధాప్య పింఛన్ వస్తుంది. సదరం సర్టిఫికెట్ కోసం ఆమె నెల రోజుల క్రితం సచివాలయంలో స్లాట్ బుక్ చేసుకుంది. సదరం ధ్రువీకరణ కొరకు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం పిహెచ్‌సి ఎంపికైంది. ఈ నెల13వ తేదీన సోమవారం ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల సమయంలో డాక్టర్‌ను కలవాలని ఆన్‌లైన్‌లో ఆమెకు సమాచారం వచ్చింది. దీంతో ఆమెను తీసుకుని సోమవారం తెల్లవారుజామున కేసనపల్లి నుంచి అద్దె కారులో బయలుదేరి స్థానిక పిహెచ్‌సికి వచ్చారు. డాక్టర్లు ఎంతకీ రాక పోవడంతో ఆసుపత్రిలో ఉన్న సిబ్బందిని అడిగారు. సోమవారం శెలవని చావు కబురు చల్లగా చెప్పారు. సోమవారం నుంచి మంగళ వారం సాయంత్రం వరకు సదరం ధ్రువీకరణ చేసే డాక్టర్ రాకపోవ డంతో వృద్ధురాలతో కుటుంబ సభ్యులు హాస్ప టల్ వద్ద పడి గాపులు కాశారు. మంగళవారం కూడా ఆ వృద్ధిరాలి సదరం దృవీకరణ చేయ కుండానే జెఎఎస్ కార్య క్రమానికి వైద్యుడు వెళ్లిపో వడంపై విమర్శలు వ్యక్తం అవుతు న్నాయి. స్థానిక పాత్రికేయులు వైద్యుల దృష్టికి తీసుకెల్లడంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు సదరం పరీక్షలు పూర్తి చేస్తామని తెలిపారు.