Nov 02,2023 18:27

రికార్డులను పరిశీలిస్తున్న దృశ్యం

రికార్డులను పరిశీలిస్తున్న దృశ్యం
సచివాలయంలో పరిశీలన
ప్రజాశక్తి-అనంతసాగరం:మండలంలోని కొత్తపల్లి గ్రామ సచివాలయంను ఎంపీడీఓ మధుసూదన్‌ రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించి కేటాయించిన 50 కుటుంబాల్లోని వారి సమస్యలను అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసి వారికి అందేలా సహకరించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలం టీర్లు పాల్గొన్నారు.