Jun 13,2023 22:23

సచివాలయం బోర్డులో అనంతపురం జిల్లా పేరు

ప్రజాశక్తి మడకశిర : కొత్తగా జిల్లా ఏర్పడి సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు జిల్లా పేరు మార్చని అధికారులు ఎంతోమంది ఉన్నారు. మడకశిర నియోజకవర్గ పరిధిలోని అమరాపురం మండలం బసవనపల్లి సచివాలయంలో ఇంతవరకు జిల్లా పేరును అధికారులు మార్చకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ మండలం సత్యసాయి జిల్లాలో భాగమై సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంతవరకు సత్యసాయి జిల్లాలోని బసవనపల్లి సచివాలయంలో నేటికీ అనంతపురం జిల్లా పేరే దర్శనమిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నూతన జిల్లాపేరు బోర్డు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.